ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా’.. ‘భరత్ అనే నేనూ..’ అన్న సంభాషణతో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. కైరా అడ్వాణీ హీరోయిన్. కొరటాల శివ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం సెన్సార్ పూర్తి కాగా, యూ/ఏ ఇచ్చారు. మరోపక్క చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్-కొరటాల కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో నిర్మాత డీవీవీ దానయ్య అందుకు తగినట్లుగానే అన్ని మార్గాల్లోనూ ప్రచార కార్యక్రమాలను భారీగా చేస్తున్నారట. ఇందుకోసం రూ.3కోట్లు ఖర్చు చేస్తున్నారని ఫిలింనగర్ టాక్.
ఇప్పటికే భారీగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించగా, ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడంతో మరింత ఆకర్షణ, ప్రచారం వచ్చింది. ఇక సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో 300లకు పైగా హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. గతంలో ఏ తెలుగు చిత్రానికి ఈ స్థాయిలో ప్రచారం చేయలేదని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
మరోపక్క అమెరికాలోనూ భారీగా విడుదల చేస్తున్నారు. మొత్తం 320కిపైగా లొకేషన్లలో సినిమాను ప్రదర్శించనున్నారట. 2000లకుపైగా స్క్రీన్లలో చిత్రం ప్రీమియర్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. తొలి వారాంతానికి మొత్తం 10 వేల షోలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ‘బాహుబలి’ తర్వాత అమెరికాలో భారీ వసూళ్లు సాధించిన సినిమాల రికార్డును బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.