ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరవై ఏడుమంది ఎమ్మెల్యేలు ,ఎనిమిది మంది ఎంపీలు గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు లొంగి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు .అయితే పార్టీలో చేరే టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడం ..అభివృద్ధి జరుగుతుందేమో అని ఆశపడి చేరితే పార్టీలో చేరి ఇన్నాళ్ళైన నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి జరక్కపోవడం ..ప్రజల్లో గతంలో ఉన్న వ్యతిరేకత కంటే ప్రస్తుతం టీడీపీ సర్కారు మీద ఇంకా ఎక్కువ అవ్వడం ..విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చడంలో కేంద్ర సర్కారు వైఫల్యం కావడం ..
SEE ALSO : ఏమిటి ఆ ఫోటో ..చంద్రబాబుకు ఎందుకు అంతా భయం ..కారణమిదే ..!
దానికి వత్తాసుగా నాలుగు ఏండ్లు కల్సి ఉన్న టీడీపీ బయటకు రావడం ఇలా పలు కారణాలతో టీడీపీలో ఉన్నవారిపై ,సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీలో ఉండి తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్కోవడం కంటే పార్టీ మారి ప్రజల్లో హుందాగా ఉండాలని ..పోయిన గౌరవాన్ని తెచ్చుకోలేకపోయిన కానీ ఉన్న కాస్త మర్యాద కాపాడుకుందామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు వైసీపీ శ్రేణులను ఆశ్రయించారు అంట .ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు ,వైసీపీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డిని సంప్రదించారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు .
SEE ALSO :అరుణ్ జైట్లీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్..!!
అయితే జగన్ ఎంతో కష్టపడి గెలిపిస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచి మారిన వాళ్ళు తిరిగి వస్తానంటే ఎలా అంగీకరిస్తాను అని ..ఒకవేళ అంతగా రావాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో స్థానాలు కేటాయించడం కుదరదు అని తేల్చి చెప్పాడు అంట జగన్ .ఇదే విషయాన్నీ ఫిరాయింపు ఎమ్మెల్యేల దగ్గర ప్రస్తావించగా టీడీపీలో ఉండి డిపాజిట్లుతో పాటుగా ఉన్న కాస్త పరువును పోగొట్టుకోవడం కంటే వైసీపీలో ఉండి మర్యాద కాపాడుకోవడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు .అయిన నమ్మిన తనకు ,గెలవడానికి దోహదపడిన వైసీపీ పార్టీకి అన్యాయం చేసి పోయిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తాను అంటే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ..కాలమే నిర్ణయిస్తుంది ..