ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీపై ..ఆ పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా ఆ పార్టీ అధినేత ,గత నాలుగు ఏండ్లుగా తెలుగు తమ్ముళ్ళ అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషప్రచారం చేయడంలో అధికార పార్టీ,దానికి వంతు పాడే పచ్చ మీడియా ముందుంటుంది అనేవిషయం తెల్సిందే.చీటికి మాటికి అయినకాడికి ..లేనికాడికి అసత్య ఆరోపణలు చేస్తూ ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ..సోషల్ మీడియాలో ప్రచారం చేసి పబ్బం గడుపుతుంటాయి.
SEE ALSO :ఏమిటి ఆ ఫోటో ..చంద్రబాబుకు ఎందుకు అంతా భయం ..కారణమిదే ..!
తాజాగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేకెత్తిస్తున్న అంశం క్యాస్టింగ్ కౌచ్ వివాదం ..దీని గురించి ప్రముఖ నటి శ్రీరెడ్డి రోజుకో పేరును బయటపెడుతూ సంచలనాన్ని సృష్టిస్తుంది.అందులో భాగంగా శ్రీరెడ్డి హైదరాబాద్ మహానగరంలోని ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి మరి దుమ్ము దులిపింది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి పక్కన ఒక మహిళ క్యారెక్టర్ కు వైసీపీ పార్టీకి సంబంధం ఉందని సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు విషప్రచారం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు .
SEE ALSO :మరో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు..?
అయితే సదరు మహిళ క్యారెక్టర్ ఆర్టిస్టు శ్రీరెడ్డితో జరిగిన ప్రెస్ మీట్ ,కత్తి మహేష్ తో జరిగిన ప్రెస్ మీట్ ,అవనిగడ్డ వైసీపీ పార్టీ కార్యాలయంలో ఉన్న ఫోటోలలో ఒకే రకమైన చీర ధరించారు.ఇక్కడే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఉంది .అదే ఏమిటి అంటే శ్రీరెడ్డి తో ప్రెస్ మీట్ ,కత్తి మహేష్ తో జరిగిన ఇంటర్వ్యూ లో ఒకే కలర్ చీర ధరించిన కానీ ఎక్కడో ఉన్న అవని గడ్డ పార్టీ కార్యాలయంలో అదే కలర్ చీర ధరిస్తూ ఫోటోలకు పోజులు ఇస్తారా ..అయిన లేనిదీ ఉన్నట్లు ..ఉన్నది లేనట్లు డిజిటల్ ఫోటో మార్ఫింగ్ చేసే తెలుగు తమ్ముళ్ళకు ఇంత చిన్న లాజిక్ ఆలోచించకుండా మార్ఫింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు ..