గత కొన్ని రోజులనుండి జరుగుతున్నఐపీఎల్ – 2018 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్ లు గెలిచి మంచి జోరు మీద ఉంది.ఒకపక్క ఐపీఎల్ లో తమ సత్తా చాటుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు..విమాన ప్రయాణ సమయాల్లో చాలా సరదాగా గడుపుతుంది. అందుకు నిదర్శనం..సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన పనే..! టీ౦లోని తోటి ఆటగాళ్లతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న శిఖర్ ధావన్, నిద్రపోతున్న షకీబ్ అల్ హసన్, రషీద్ ఖాన్ లను ఆటపట్టించాడు.ఓ చిన్న పేపర్ ను గుండ్రంగా చుట్టి నిద్రపోతున్న వాళ్లిద్దరి దగ్గరకు వెళ్లి ముక్కుల్లో పెట్టి వారి నిద్ర చెడగొట్టాడు.నిద్రలోకి జారుకున్న ఆటగాళ్లకు అసలు ఏం జరిగిందో అర్థం కాకపోయినప్పటికీ, ‘ఇది ధావన్ పనే’ అని ఆ తర్వాత తెలుసుకుని నవ్వుకున్నారు.అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
