జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన రాసలీలల భాగోతాలు త్వరలో బట్టబయలు కానున్నాయా..? పవన్ కల్యాణ్ రాసలీలలపై అంతగా ఫోకస్‌పెట్టిన ఆ మంత్రి ఎవరు..? ఇంతకీ ఆ మంత్రి మహిళా సంఘాలను కలవడానికి గల కారణాలేంటి..? ఆ మంత్రి అవినీతి భాగోతాన్ని పవన్ బయటపెట్టాడు కాబట్టే.. ఇప్పుడు పవన్ రాసలీలల భాగోతాన్ని బయటపెట్టేందుకు ఆ మంత్రి సిద్ధమయ్యాడా..? అన్న ప్రశ్నలకు ఇటు రాజకీయ ప్రముఖులు, అటు సినీ జనాలు అవుననే సమాధానం ఇస్తున్నారు.
అయితే, ఇటీవల కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇతర రాష్ట్రాల నటులకే కాకుండా.. తెలుగు వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, సినీ ఇండస్ర్టీలో తెలుగు యువతులు, మహిళలపై వయస్సుతో తేడా లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారంటూ శ్రీరెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల్లో కొన్ని రుజువు కాగా.. మరికొన్ని ఆరోపణలకు సంబంధించిన వివరాలను త్వరలో బయటపెడతానని శ్రీరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఇలా శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి మహిళా లోకం అంతా కలిసి మద్దతు తెలిపడంతోపాటు పలు చర్చాగోష్టిలు నిర్వహించాయి.
అందులో భాగంగా… ఇటీవల ఏర్పాటు చేసిన చర్చలో సినీ ఆర్టిస్ట్ శృతి పవన్ కల్యాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కల్యాణ్‌కు మూడు పెళ్లిళ్లు అయినా.. ఇప్పటికీ ఆ యావ ఛావలేదు, అతనికి మసాజ్‌లు చేయడానికి బెంగాళీ అమ్మాయిలే కావాలి అని, అందు కోసం పవన్ కల్యాణ్ ప్రతీ ఆదివారం తన ఫామ్‌హౌస్‌కు పది మంది అమ్మాయిలను తెప్పించుకుంటాడంటూ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది.
అందుకు సంబంధించిన వివరాలను సాక్ష్యాలతో సహా బయటపెట్టేందుకు నేను రెడీ.. పవన్ కల్యాన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే రమ్మనండి.. నేను వీడియోలతో సహా ఆధారాలను బయటపెడ్తా అంటూ చెప్పింది నటి శృతి.
ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి ఒకరు నటి శృతిని కలిశారని, పవన్ కల్యాణ్‌కు సంబంధించిన రాసలీలల వీడియోలను తనకు ఇవ్వాలని బేరం కుదుర్చుకున్నారన్నది టాలీవుడ్ సమాచారం. ఇప్పటికే ఆ మంత్రి హైదరాబాద్‌లో నటి శృతి కోసం పాగా వేశాడని, నటి శృతి నుంచి ఆ వీడియోలను ఏపీకి తీసుకెళ్లే వరకు తనను అమరావతి రావొద్దంటూ అధిష్టానం ఆదేశించిందని.. ఆ మంత్రి తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. ఇంతకీ ఆ మంత్రి ఎవరన్నది..? తెలియాల్సి ఉంది.