ప్రస్తుతం ఎక్కడి ఏటీఎం చూసినా ” నో క్యాష్ ” బోర్డులే దర్శనమిస్తున్నాయి.ఈ పరిస్థితి ఇప్పటి నుండే కాదు..2016 నవంబర్‌లో నోట్ల రద్దు నుండి ప్రజలు ఈ పరిస్థితిని ఎదరుక్కుంటున్నారు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ..బ్యాంకులకు వెళుతుంటే అక్కడ సైతం అడిగినంత డబ్బు వారిది వారికి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు.కనీసం నగరంలోనైన ఒకటి రెండు ఏటీఎంలల్లో డబ్బులున్నా .. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు నరకం చూస్తున్నారు.దీంతో మోదీ సర్కారు పై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకు అధికారులు మాత్రం గత కొన్ని రోజులనుండి బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. మరోవైపు రూ. 2 వేల నోట్లు తిరిగి డిపాజిట్ కావడం లేదని చెబుతున్నారు. అయితే రద్దయిన నోట్ల స్థానంలో 80 శాతం కరెన్సీని కొత్త నోట్ల రూపంలో విడుదల చేసినప్పటికీ, అవి పూర్తి స్థాయిలో సర్క్యులేట్ కావడం లేదని వెల్లడించారు.