Home / TELANGANA / ప్రజలకు కష్టం, పన్ను కట్టేవారికి ఇబ్బంది లేకుండా జీఎస్టీ ఉండాలి..మంత్రి ఈటెల

ప్రజలకు కష్టం, పన్ను కట్టేవారికి ఇబ్బంది లేకుండా జీఎస్టీ ఉండాలి..మంత్రి ఈటెల

ఈ-వే బిల్లు, జీఎస్టీ అమలులో క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు . ప్రజలకు కష్టం లేకుండా, పన్ను కట్టేవారికి ఇబ్బంది లేకుండా జీఎస్టీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో బీహార్ ఉప ముఖ్య‌మంత్రి సుశీల్ మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన జీఎస్టీ ఉప సంఘం స‌మావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌, వినియోగదారుల వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ పాల్గొన్నారు. జీఎస్టీ అమ‌లులో సామాన్య పౌరులు ప‌డుతున్న ఇబ్బందులు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై మంత్రి స‌మావేశంలో లేవ‌నెత్తారు.

జీఎస్టీ స‌మావేశం అనంత‌రం మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడుతూ… జీఎస్టీ అమ‌లులో సామాన్యులు, వ‌ర్త‌కులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. 3 బి అనే కొత్త ప‌ద్ద‌తితో జీఎస్టీని స‌ర‌ళీక‌రించేందుకు అన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. టాక్స్ ఎగ‌వేత‌దారుల‌కు చెక్ పెట్టేందుకు కీల‌క నిర్ణ‌యాలు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ రోజు జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌ధానంగా సిఐఐ సంస్థ, ఇతర నిపుణుల అభిప్రాయాలని తీసుకున్నామ‌ని మంత్రి తెలిపారు. ట్రేడింగ్ కి ఇబ్బందిలేకుండా జిఎస్టీ ని అమలు చేయ‌నున్న‌ట్లు మంత్రి వివ‌రించారు. రాబోయే జిఎస్టీ కౌన్సిల్ లో కొత్త ప్రతిపాదనలు తీసుకురావ‌డంతో పాటూ, వాటిని ప‌క‌డ్బాందిగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ప్ర‌స్తుతం ఈ వే బిల్ పద్ధతిలో ఎదురవుతున్న స‌మ‌స్య‌లు త్వరలో పరిష్కారం కానున్న‌ట్లు మంత్రి తెలిపారు. అందుకు గానూ నేటి సమావేశంలో మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసేందుకు గాను కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంతి ఈటెల రాజేందర్ వెల్లడించారు. సామాన్యుల‌కు, పన్ను క‌ట్టే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీఎస్టీ అమ‌లు కావాల‌ని మంత్రి ఆకాంక్షించారు.

దేశంలోనే తెలంగాణ మొదటి నుంచి ప్రోగ్రెసివ్ రాష్ట్రంగా ఉంద‌ని మంత్రి గుర్తు చేశారు. ఎఫ్ఆర్ బిఎం రుణాలను తగ్గించ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఎఫ్ఆర్బిఎం ను 25 నుంచి 20 శాతంకి తగ్గించ‌డం స‌రికాద‌ని మంత్రి తెలిపారు. 15వ ఆర్థిక సంఘం రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మంత్రి , రాష్ట్రాల హక్కుల్ని హరించేలా ఆర్థిక సంఘం నిర్ణ‌యాలు ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఒకే దేశంలో కేంద్ర ప్ర‌భుత్వానికి ఒక నియ‌మం, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఒక నియ‌మం ఉండ‌కూడ‌ద‌ని మంత్రి తెలిపారు. 2011 జనాభా ప్రతిపదికనే నిధులను ఇస్తామనడం సరికాదని మంత్రి తెలిపారు. అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌తో జనాభాని తగ్గించి అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న రాష్ట్రాల‌కు త‌ప్ప‌కుండా ప్రోత్సాహ‌కాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి గుర్తు చేశారు. 7.3 లక్షల కోట్ల NPA లు ఉన్న‌ట్లు కేంద్ర గుర్తించింద‌ని, అందువ‌ల్లే న‌గ‌దు కొర‌త‌ స‌మ‌స్య ఉత్పాన్నం అయింద‌ని మంత్రి వివ‌రించారు. ఉన్నాయి. ఎక‌రానికి 4 వేల రూపాయ‌లను పంట పెట్టుబ‌డిలో ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అందిచ‌నున్న నేప‌థ్యంలో నగదు కొరత లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మూడు నెల‌ల క్రిత‌మే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ని కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామ‌ని హామి ఇచ్చార‌ని, ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై విశ్వాసంతో ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat