తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నగదు కొరతపైస్పందిస్తూ…భారతదేశంలో నగదు లభ్యతపై సమీక్ష నిర్వహించా. మొత్తం మీద సరిపడనంత నగదు చలామణిలో ఉంది. బ్యాంకుల వద్ద నగదు అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి అసాధారణ డిమాండ్ పెరగడంతో తాత్కాలిక కొరత ఏర్పడింది. అయితే వెంటనే దీన్ని పరిష్కరించడం జరిగింది’’ అని ట్వీట్ చేశారు.
Have reviewed the currency situation in the country. Over all there is more than adequate currency in circulation and also available with the Banks. The temporary shortage caused by ‘sudden and unusual increase’ in some areas is being tackled quickly.
— Arun Jaitley (@arunjaitley) April 17, 2018
అయితే ఈ విషయంపై మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ తనదైన శైలిలో స్పందించారు…బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగానో లేక తాత్కాలికంగానో రాలేదని, ఈ విషయమై మూడు నెలలుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తరుచూ ఫిర్యాదులు వచ్చాయని.. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని క్రమంగా వమ్ము చేస్తోన్న సమస్యపై ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ లోతుగా పరిశీలించాలని మంత్రి కేటీఆర్ సూచిస్తూ ట్వీట్ చేశారు.ఈ క్రమంలో నగదు కొరత తమ సమస్యను అర్ధం చేసుకొని కేటీఆర్ ట్వీట్ చేయడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
An example to what I had said previously @arunjaitley Ji https://t.co/MC2VOdJctd
— KTR (@KTRTRS) April 17, 2018
Sir, with due respect the cash shortage in Banks & ATMs is neither sudden nor temporary. I’ve been hearing complaints for over 3 months repeatedly in Hyderabad
Pls have RBI & Fin Min team dig deeper & not brush away an issue that is eroding people’s confidence in banking system https://t.co/llHzY6kiox
— KTR (@KTRTRS) April 17, 2018