టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో రామ్ సరసన ఇంట్రడ్యూజ్ అయింది గోవా బ్యూటీ ఇలియానా . కుర్రకారు గుండెలు కొల్లగొట్టేసింది .టాలీవుడ్లో ఫస్ట్ కోటి రూపాయిల పారితోషకం తీసుకున్న హీరోయిన్గా గుర్తింపు తెచ్చకుంది ఇలియానా. అయితే ప్రస్తుతం ఇలియానాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అది ఏమీటంటే ఇలియానా తల్లి కాబోతోంది అనే వార్త హల్ చల్ చేస్తుంది. గత కొంత కాలంగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ఇలియానా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివాహం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఇలియానా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేస్తూ, ‘హబ్బీ’ (భర్త) అని కామెంట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇపుడు ఇలియానా తల్లి కాబోతున్నారని తాజా రూమర్. అజయ్ దేవగణ్‌తో కలిసి రైడ్ చిత్రంలో కథానాయికగా నటించింది ఇలియానా. ఇటీవలే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. దీంతో సినిమా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఇలియానా, తాను గర్భం దాల్చిన సంగతి బయటపడకుండా ఉండేందుకు లూజు, తేలికైన డ్రస్సుల్లో కనిపిస్తున్నారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా ఆండ్రూ తన ఇన్ స్టాగ్రామ్‌లో ఇలియానా ఫొటోను షేర్ చేశాడు. బాత్ టబ్ లో కాఫీ తాగుతూ ఉన్న ఇలియానా ఫోటోకు ఆండ్రూ ‘ఇలియానా ఒంటరిగా మధురమైన సమయాన్ని గడుపుతున్నారు’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఆమె నిజంగానే గర్భం దాల్చినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Tags Bolly wood iliyana pregent social media