ఏపీ ,బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభం పాటి హరిబాబు రాజీనామా చేశారు.ఈ మేరకు అయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు పంపారు.సోమవారం సాయంత్రమే హరిబాబు తన రాజీనామా లేఖను అధిష్టానం కు పంపినట్లు సమాచారం . కొత్త కమిటీ ఎంపిక కోసమే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు బీజేపీ ఏపీ కొత్త చీఫ్‌గా ఎవరిని నియమించాలనే విషయంపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఇప్పటికే మాజీ మంత్రి మాణిక్యాల రావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వినిపిస్తున్నాయి. కాగా, ఏపీ బీజేపీ చీఫ్‌గా కంభంపాటి హరిబాబ నాలుగేళ్ల పాటు పనిచేశారు. క్లిష్టమైన సమయాల్లోనూ ఆయనకు అధిష్టానం అండగా ఉంది. అయితే ఏపీ రాజకీయాల్లో ఆయన రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.