తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులేనని నల్లగొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా సర్వే సత్యనారాయణ (కేంద్ర మాజీ మంత్రి) తానే సీఎం అభ్యర్థినని ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇవాళ నల్లగొండ జిల్లాలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ భూ కొనుగోళ్ళలో రూ. 300 కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.. అసత్యాల్ని ప్రచారం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
