Home / POLITICS / పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!!

పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!!

బీజేపీ , కాంగ్రెస్ లకు పోటీ అని కాకుండా అమెరికా , చైనా లతో భారత్ అభివృద్ధిలో పోటీ పడాలనే ప్రధాన ఎజెండాతో తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు అత్యంత వ్యూహాత్మకంగా , అడుగులు పడుతున్నయి . జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా , లోతుగా గమనిస్తే 2019 లో కేంద్రంలో పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ప్రోగ్రామింగ్ జరుగుతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతున్నది . కాంగ్రెస్ , బీజేపీ యేతర ప్రత్యామ్నాయాన్ని రూపొందించడానికి తాను కర్మశుద్ధితో అడుగులు వేస్తానని ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రోజు నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది .

ప్రాంతీయ పార్టీల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించినప్పటి నుండే కేసీఆర్ కార్యాచరణ ప్రారంభమైంది . ఆ తర్వాత ఆయన కోల్ కతా వెళ్లి మమతా దీదీ తో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి ఉమ్మడి మీడియా సమావేశంలో పీపుల్స్ ఫ్రంట్ కోసం బలంగా ప్రయత్నిస్తామని ఇద్దరూ ప్రకటించడం కీలక పరిణామంగా పేర్కొనాలి . ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్న సీఎం కేసీఆర్ అవి ముగిసిన వెంటనే మళ్ళీ కార్యాచరణ ను వేగవంతం చేశారు .

ఇటీవల బెంగళూరు వెళ్లి మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవెగౌడ ను కలిసి చర్చలు జరపడం … ఆయన కూడా పీపుల్స్ ఫ్రంట్ కు మద్దతివ్వడం వేగంగా జరిగిన పరిణామాలు . అయితే అదే కర్ణాటక లో జరుగుతున్న ఎన్నికల్లో అక్కడ ఎక్కువ ప్రభావం చూపనున్న తెలుగు ఓటర్లందరూ దేవెగౌడ సారధిగా ఉన్న జనతాదళ్ ఎస్ (జేడీఎస్) కు మద్దతివ్వాలని కేసీఆర్ పిలుపునివ్వడం కర్ణాటక రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది . బహుశా జేడీఎస్ అగ్రనేతలు కూడా కేసీఆర్ పిలుపును ఊహించి ఉండక పోవచ్చు . కేసీఆర్ తెలుగు ఓటర్లకు ఇచ్చిన పిలుపు ప్రభావం చాలా వరకు పని చేసే అవకాశం ఉందని కర్ణాటక రాజకీయ విశ్లేషకుల అంచనా . అంతే కాకుండా కర్ణాటక రాష్ట్రానికి చెందిన … కన్నడ , తమిళ , తెలుగు , మలయాళీ , హిందీ భాషల్లో మంచి నటుడిగా , అభ్యుదయవాదిగా పేరున్న ప్రకాష్ రాజ్ కేసీఆర్ వెంట బెంగళూరు వెళ్లడం కూడా అక్కడి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని సమాచారం .

ఇవ్వన్నీ జరుగుతుండగానే దేశంలో ముస్లిం మైనార్టీల పక్షాన నిలబడుతూ జాతీయ స్థాయిలో చాలా రాష్ట్రాల్లో పార్టీల బలాబలాలను ప్రభావితం చేస్తున్న ఎం ఐ ఎం పార్టీ కూడా నిన్న కర్ణాటకలో జేడీఎస్ కు మద్దతు ప్రకటించడం సంచలనం కలిగించింది . పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటులో కేసీఆర్ సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే ఎం ఐ ఎం అగ్రనేత అసదుద్దీన్ ఈ ప్రకటన చేసినట్లు అర్ధమవుతున్నది . అన్ని మతాలను గౌరవిస్తూనే హిందూ , ముస్లిం ప్రజల సత్సంబంధాలు గంగాజమునా తెహజీబ్ వలే దేశమంతా కొనసాగాలనే కేసీఆర్ ఆకాంక్షే ఎం ఐ ఎం పీపుల్స్ ఫ్రంట్ పట్ల సానుకూలంగా ఆలోచించడానికి ప్రధాన కారణమని తెలుస్తున్నది . భవిష్యత్తులో పీపుల్స్ ఫ్రంట్ కు మద్దతిచ్చే అన్ని పార్టీల పట్ల ఎంఐఎం సానుకూలంగా ఉండే అవకాశాలు లేకపోలేదు . ఈ నేపథ్యంలోనే తాజాగా ఒడిశా ముఖ్యమంత్రి , బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మే మొదటి వారంలో చర్చించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించడం మరో శుభపరిణామమనే చెప్పాలి . మొత్తమ్మీద పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ రోజురోజుకు జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat