తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు భాష అంతరించి పోతున్న ప్రస్తుత రోజుల్లో.. తెలుగు భాష అంతరించి పోకూడదు.. తెలుగు వారందరం కూడా మమ్మీ, డాడీ అనే పదాలను వదిలేసి.. అమ్మ, నాన్న అనాలని, తెలుగు భాషలోనే మాట్లాడాలనే సంకల్పంతో ఉద్యమంలా కార్యక్రమాలు నిర్వహించారు ప్రముఖ తెలుగు కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. అయితే, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఓ పాటను శ్రోతలకు వినిపించారు.
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పాడిన పాట మీ కోసం..!!
ఆ పార్టీలో నుంచి రామా హరీ..! నేను ఈ పార్టీకొచ్చాను రామా హరీ..!!
మామా అంటూనే రామా హరీ..! వెన్నుపోటు పొడిచాను రామా హరీ..!!
డబ్బు మూటలు చూపి రామా హరీ..! ఎమ్మెల్యేలను కొన్నాను రామా హరీ..!!
ఎమ్మెల్సీ సీటుపై రామా హరీ..! కొడుకును మంత్రిని చేశాను రామా హరీ..!!
ప్రత్యేక హోదాతో రామా హరీ..! ప్రజలను నట్టేట ముంచాను రామా హరీ..!!
ఏ పార్టీలో ఉన్నా రామా హరీ..! నేను చేసేది ఏముందీ రామా హరీ..!! ఇరగ దీసేది ఏముందీ రామా హరీ..!!!
అన్నమక్కరలేదు రామా హరీ..! ప్రజల అభివృద్ధి తింటాను రామా హరీ..!! దేశ ప్రగతి భోం చేస్తారు రామా హరీ..!!!
స్టేటు ఏమైతేనేం రామా హరీ..! నా.. సీటు ముఖ్యంగా కానీ రామా హరీ..!!
నా దోపిడే కాదు రామా హరీ..! నా కొడుకు దోచాలి రామా హరీ..!!
నా మణవడు దోచాలి రామా హరీ.!. ముని మనవడూ దోచాలి రామా హరీ..!!
మీ ఖర్మ ఇంతే కృష్ణా హరీ..!!
అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించి.. తరువాత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి.. చంద్రబాబు తన కుఠిల రాజకీయాలతో నాడు ఎమ్మెల్యేలందరినీ కూడా తనవైపు తిప్పుకున్నారు. ఇలా చంద్రబాబు నాటి నుంచి నేటి వరకు ప్రజలను వంచించిన విధానం, డబ్బు మూటలు చూపి వైసీపీ ఎమ్మెల్యేలను కొన్న విషయం, తన కుమారుడు నారా లోకేష్‌కు మంత్రి పదవి కట్టబెట్టిన నేపథ్యం.. ఇలా చంద్రబాబు అవినీతి కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రస్తుత రాజకీయాలపై ప్రముఖ తెలుగు కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పాటను ఆలపించారు.