ఆమె 2014 ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక ప్రముఖ సాధారణ వ్యాపారవేత్త ..అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున కర్నూలు లోక్ సభ స్థానానికి నిలబడి టీడీపీ అభ్యర్థిపై నలబై మూడు వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొంది పార్లమెంటు లోపల అడుగు పెట్టింది ..అలా అప్పటివరకు కేవలం ఒక ప్రముఖ సాధారణ వ్యాపారవేత్తగా ప్రాచుర్యం పొందిన ఆమె ఒక్కసారిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండతో రాజకీయంగా దేశానికి తెలిసింది.ఇంతకూ ఎవరు ఆమె అని ఆలోచిస్తున్నారా ఆమె ఎంపీ బుట్టా రేణుక .అయితే గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన రేణుక ఇటివల అధికార టీడీపీ పార్టీలో చేరారు .
See Also:Big Breaking News-పవన్ కల్యాణ్‌కు శ్రీరెడ్డి అద్దిరిపోయే కౌంటర్..!!
ఈ క్రమంలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుట్టా రేణుకకు కొన్ని ప్రాజెక్టులతో పాటుగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తాను అని హామీ ఇవ్వడంతో వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఇక్కడే ఆమె టీడీపీ పార్టీకి చెందిన ఒక యువ ఎమ్మెల్యేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది .ఎంపీ బుట్టా రేణుక కర్నూలులోని ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవారు ..అంతేకాకుండా చేనేత సామాజిక వర్గానికి చెందిన ఆమె ఆ వర్గ ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు .
See Also:వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ..జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ..!
అయితే మొదటి నుండి ఈ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉండటం ..పార్టీ మారిన సమయంలో ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తాను అని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో ఆమె కన్ను ఇప్పుడు ఈ అసెంబ్లీ నియోజకవర్గం మీద పడింది .రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడే అభ్యర్థి కర్నూలు పార్లమెంటు నుండి గెలుపొందే అవకాశం ఉందని పలు సర్వేలు తెలపడంతో ఆమె ఎంపీ స్థానం నుండి ఎమ్మెల్యేగా నిలబడాలని నిర్ణయం తీసుకుంది .కాకపోతే ప్రస్తుతం ఈ నియోజకవర్గం జయ నాగేశ్వర రెడ్డి టీడీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నరు .అట్లాంటిది సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చంద్రబాబు బుట్టా రేణుకకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ..ఒకవేళ ఇచ్చిన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జయ నాగేశ్వర రెడ్డి దానికి సమ్మతిస్తాడా ఇలా పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ వర్గాలు ..చూడాలి మరి ఎంపీగా పార్టీలో చేరి యువ ఎమ్మెల్యేకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బుట్టా రేణుకకి ఎమ్మెల్యే సీటు వస్తుందో లేదో ..!
See Also:వైసీపీలోకి నెల్లూరు జిల్లా టీడీపీ మాజీ మంత్రి -ముహూర్తం కూడా ఫిక్స్ ..!