Home / ANDHRAPRADESH / నాడు పిల్ల‌నిచ్చిన మామను.. నేడు సీఎంను చేసిన ప్ర‌జ‌ల‌ను వెన్నుపో టు పొడిచాడు..!!

నాడు పిల్ల‌నిచ్చిన మామను.. నేడు సీఎంను చేసిన ప్ర‌జ‌ల‌ను వెన్నుపో టు పొడిచాడు..!!

నాడు పిల్ల‌నిచ్చిన దివంగ‌త ముఖ్య‌మంత్రిని, నేడు ముఖ్య‌మంత్రిని చేసిన ఏపీ ప్ర‌జ‌ల‌ను నారా చంద్ర‌బాబు నాయుడు ఊహించని రీతిలో వెన్నుపోటు పొడిచార‌ని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి, ఆంధ్రా మేధావుల సంఘం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు అన్నారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ… చంద్ర‌బాబు స‌ర్కార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

see also : 

మక్కా మసీదు పేలుళ్ళ కేసులో నాంపల్లి కోర్టు సంచలనాత్మక తీర్పు ..!

అయితే, చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అస‌లే అప్పుల్లో ఉంటే.. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు మాత్రం ఈవెంట్ల‌కంటూ వేల‌కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తారా.? అంటూ ప్ర‌శ్నించారు. నాడు, పుష్క‌రాల స‌మ‌యంలో 29 మందిని బ‌లితీసుకున్న చంద్ర‌బాబు.. ఆ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వారి పేర్ల‌ను ఇప్ప‌టికీ బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని, ఆ ఘ‌ట‌న‌కు కార‌కులైన వారి పేర్ల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త సీఎం చంద్ర‌బాబుపై ఉంద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో.. ప్ర‌త్యేక హోదా పోరాటంలో చంద్ర‌బాబుకు ఎన్ని మార్కులు వేస్తారు అంటూ యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు చ‌ల‌సాని శ్రీ‌నివాస్ స్పందిస్తూ.. అస‌లు చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాపై పోరాటం చేస్తేనే క‌దా..!! మార్కులు వేయ‌డానికి అంటూ ఎద్దేవ చేశారు చ‌ల‌సాని. ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబుది త‌త్త‌ర.. బిత్త‌ర పోరాటం.. అతినిక అస‌లు మార్కులే లేవ‌న్నారు. సీఎం చంద్ర‌బాబుతో స‌హా.. టీడీపీ నేత‌లు ప్ర‌త్యేక హోదా ద్రోహులు అంటూ చ‌ల‌సాని మండిప‌డ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat