ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత నాలుగు ఏండ్లుగా రెండున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ బస్టాండ్ లో బడేమకాన్ భూములకు సంబంధించి తెలుగు తమ్ముళ్ళు కొట్టుకునే స్థాయికి వచ్చింది .
రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు మదనపల్లె టీడీపీ పార్టీ మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్ పై అందరూ చూస్తుండగానే మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో టీడీపీ నాయకుడు బోయపాటి సురేష్ దాడి చేశారు ..ఈ దాడి జరిగిన సమయంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ,సహచర
కౌన్సిలర్లు ,పార్టీ నాయకులు అక్కడే ఉండటం గమనార్హం ..
అయితే బెంగుళూర్ బస్టాండ్ పరిధిలో భూముల గురించి కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చింది కాబట్టి తమకు ఆ భూములను కేటాయించాలని ఒక వర్గం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ వచ్చింది .ఈ క్రమంలో తమకు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ అయిన శివప్రసాద్ ను అడిగారు కూడా ..అందుకు శివప్రసాద్ నో చెప్పడమే కాకుండా ఏకంగా అతనే ఈ భూములను అక్రమించుకోవాలని ప్లాన్ చేశారని కోపంతో దాడికి దిగారు .అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ..