ఏపీ లో అదికారంలో ఉన్న టీడీపీ ప్రబుత్వం పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రతి పక్షం అయిన వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఈ వలసలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో కొనసాగుతున్నాయి. తాజాగా చంద్రబాబు నియోజక వర్గంలో వలసలు జరిగాయి. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా వైసీపీలో చేరవచ్చునని వైసీపీ పార్టీ కుప్పం నియోజక వర్గ సమన్వయకర్త కె.చంద్రమౌళి అన్నారు. ఆదివారం వీర్నమల గ్రామంలో జరిగిన సభలో ఆయన ఈమేరకు ప్రజలకు పిలుపునిచ్చారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతూ అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం వీర్నమల పంచాయతీ వేమనపల్లెకి చెందిన దాదాపు 100 మంది యువకులు తెలుగుదేశం నుంచి చంద్రమౌళి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వీర్నమల గ్రామంలో పార్టీ జెండాను చంద్రమౌళి ఆవిష్కరించారు. వైసీపీ అధికారంలోకి రాగానే వీర్నమల పంచాయతీని 4 చిన్న పంచాయతీలు గా విభజించి అభివృద్ధి జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
