మీడియా సాక్షిగా..!! దగ్గుబాటి అభిరామ్ రాసలీలల విశ్వరూపానికి వత్తాసు పలికిన జనసేనాని. అవును..! జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డిని లైంగికంగా వాడుకున్న తెలుగు సినీ ఇండస్ర్టీలో బడా ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌కు వత్తాసు పలుకుతూ మీడియా సాక్షిగా దొరికిపోయాడు.
అయితే, సినీ రంగంలో రాణించాలన్న ఆసక్తితో, ఎంతో ప్యాషన్‌తో వస్తున్న తెలుగు అమ్మాయిలను తమ చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ కొందరు స్టార్ హీరోల నుంచి ప్రొడ్యూసర్ల, వరకు, డైరెక్టర్ల నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ లైంగికంగా వాడుకుని, చివరకు మీకు.. మాకు ఏం సంబంధం లేదు అన్న రీతిలో వారికి సినిమాల్లో అవకాశాలు కల్పించకుండా మానాలను దోచుకున్న తరువాత వీధిపాలు చేస్తున్నారని, ఇకనైనా అటువంటి పరిస్థితి మారాలని తెలుగు సినీ ఇండస్ర్టీపై యుద్ధం ప్రకటించింది శ్రీరెడ్డి. అయితే, శ్రీరెడ్డి ప్రకటించిన ఆ యుద్ధంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని మహిళా సంఘాలన్నీ భాగమయ్యాయి. అంతేకాదు, తెలుగు సినీ ఇండస్ర్టీలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై పోరాటాన్ని ప్రారంభించాయి. అందులో భాగంగానే.. ఇటీవల హెచ్ఆర్సీ స్పందించి.. తెలుగు సినీ ఇండస్ర్టీపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా..!!
ఇటీవల కాలంలో జనసేన అధినేత మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరెడ్డి విషయంపై స్పందించారు. శ్రీరెడ్డి ఇలా బట్టలు విప్పి ప్రదర్శన చేస్తే.. న్యాయం జరగదని, పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగితేనే తగిన న్యాయం జరుగుతుందని హితవు పలికారు. శ్రీరెడ్డికి న్యాయం జరగాలంటే.. కోర్టుల్లో న్యాయవాదులు, పోలీసులు మాత్రమే చేయగలరన్నారు. మీడియా వారు ఈ విషయంపై రెండు నెలలు కాదుకదా..! పది నెలలు మాట్లాడినా..!! శ్రీరెడ్డికి న్యాయం జరగదన్నారు.
see also : నన్ను అన్నా… అని పిలవొద్దంటూ.. ఇగో మూవీ సమయంలో.. రామానాయుడు స్టూడియోస్‌లో..!!
ఇంతలో ఓ విలేఖరి పవన్‌ను ప్రశ్నిస్తూ.. ఆ అమ్మాయి తనకు సపోర్టు కావాలని అడుగుతోంది.. సర్..?? ఆ విషయంలో నా మద్దతు శ్రీరెడ్డికే ఉంటుంది..! కానీ నేనేం చేయగలను.. నేనేం పోలీసును కాదు.. నేనేం న్యాయవాదిని కాదు..అటువంటప్పుడు నేనేం చేయగలను అంటూ ఎదురు ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
ఇలా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ మాటలను నిశితంగా పరిశీలించిన నెటిజన్లు.. జనసేన అధినేతపై పెదవి విరుస్తున్నారు. అయితే, వారి ఆగ్రహానికి కారణం లేకపోలేదు. సుమారు 20 నిమిషాలపాటు మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. దగ్గుబాటి అభిరామ్ పేరును ఏ ఒక్క సారి కూడా పలకకపోవడం గమనార్హం. ఇప్పుడు ఈ విషయంపైనే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దగ్గుబాటి అభిరామ్ రాసలీలల గుట్టును ఫోటోలతో సహా శ్రీరెడ్డి బయటపెడితే.. పవన్ కల్యాన్‌కు అవేవీ తెలియనట్టు దగ్గుబాటి పేరును ప్రస్తావించకపోవడం వెనుక మర్మమేమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, శ్రీరెడ్డి గత రెండు నెలల నుంచి తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా వేదికగా వెల్లడిస్తున్న నేపథ్యంలో స్పందించని పవన్ కల్యాణ్.. ఇటీవల దగ్గుబాటి అభిరామ్ ఫోటోలను బయటపెట్టగానే మీడియా ముందుకొచ్చి పోలీసు స్టేషను.. కోర్టులంటూ హడావుడి చేస్తున్నారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.