ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ ఆడవారిపై దారుణాలు ..అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా దేశ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ ,యూపీలో జరిగిన అత్యాచార ఘటనలు దేశంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ళ చిన్నారిపై జరిగిన దారుణాన్ని అందరు ఎండగడుతూ నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో తమినాడు కు చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ అయిన నివేథా పేతురాజ్ తన బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి మాట్లాడారు.
ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి .వీటిలో కొన్నిటిని మనం జాగ్రత్తగా ఉంటె ఖండించవచ్చు .అటువంటి సమస్యల్లో ఒకటి స్త్రీల రక్షణ ..ప్రస్తుతం చిన్నవయస్సులో ఉన్న చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి .ఆ బాధింపునకు నేను ఐదేళ్ళ వయస్సులోనే గురయ్యాను .అయితే అప్పుడు ఆ విషయాన్నీ అమ్మవాళ్ళకు ఎలా చెప్పగలను ..అసలు ఏమి జరిగిందో తెలియని వయస్సు అది అని ఆమె చెప్పుకొచ్చింది …