అప్పటి ఉమ్మడి ఏపీలో సరిగ్గా పదకొండు ఏళ్ళ ముందు అంటే 2007 మే 18న హైదరాబాద్ మహానగరంలో మక్కా మసీద్ పరిధిలో జరిగిన ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న పేలుళ్ళ కేసులో నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది .
అందులో భాగంగా మక్కా మసీద్ లో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.అయితే దాదాపు పదకొండు ఏళ్ళ పాటు న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులకు చివరకు నిరాశే మిగిలింది. నిందితులపై సరైన ఆధారాలను చూపించకపోవడంతోనే
నిర్దోషులుగా ప్రకటించినట్లు కేసును కొట్టేస్తున్నట్లు కోర్టు తెలిపింది ..