మక్కామసీద్ పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి ఎన్ఐఏ కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెల్లడించిన విషయం విదితమే. ఐదుగురు నిందితులైన స్వామి అసీమానంద, దేవేందర్ గుప్తా, రాజేందర్ చౌదరి, లోకేశ్ శర్మ, భరత్ భాయిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.అయితే ఈ తీర్పు పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.గత కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో బాధితులకు అన్యాయం జరిగిందన్నారు . 2014 జూన్ తర్వాత ఈ కేసులోని సాక్ష్యులు వెనకడుగు వేశారని.. నిందితులకు బెయిల్ వస్తే ఎన్ఐఏ కనీసం ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్‌కు కూడా వెళ్లలేదని ఓవైసీ అన్నారు.
