గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోంది అంటూ పలువురు నటీమణులు మీడియాకెక్కి రచ్చ చేయడం చూశాం. ఈ పోరాటానికి తెర లేపిన నటి శ్రీరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి, సత్యాచౌదరిపై చర్యలు తీసుకోవాలని హుమాయూన్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 4న ఓ టీవీచానల్‌లో డిబేట్ సందర్భంగా తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో పెర్కొంది శ్రీరెడ్డి.
పైగా తనను చంపుతామని బెదిరిస్తున్నారని కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై తెలుగు సినీ పరిశ్రమను ప్రక్షాళన చేసేందుకు మహిళా లోకం కదిలింది. ఆదివారం రోజు సమావేశం అయిన ‘శ్రీరెడ్డి అండ్ కో’ టాలీవుడ్ పెద్దలపై విరుచుకుపడ్డారు. “తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్ధిక దోపిడీలపై బహిరంగ చర్చ” అంటూ మహిళా సంఘాల ఐక్యకార్యాచరణ కమిటిగా ఏర్పడి చీకటి కోణంలో జరిగే విషయాలను బట్టబయలు చేశారు.
ఈ క్రమంలో నటి శృతి సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను సాక్ష్యాలతో సహా బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కరాటే కళ్యాణి..సత్య చౌదరి ఎక్కడ…ఎవరి దగ్గర పడుకోకుండానే అవకాశలు వచ్చాయా అని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాదు ఇంకా నటి శివపార్వతి అప్పట్లో పడుకోకుండానే క్యారెక్టర్ తెచ్చుకుందా …మేము పడుకోవాల అంటూ వారిపై విరుచుకుపడింది.