టాలీవుడ్ ముద్దుగుమ్మ ..ఒకవైపు అందాలతో మరోవైపు చక్కని అభినయంతో కుర్రకారు మదితో పాటుగా తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.చిన్నహీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుందరాంగి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ అండ్ స్టార్ హీరో సరసన నటించే స్థాయికి ఎదిగింది.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తమపై వస్తున్న వార్తలపై అవి వాస్తవాలు కాదు అని చెప్పుకునే స్థాయికి వచ్చారు సెలబ్రేటీలు .
తాజాగా ఈ ముద్దుగుమ్మ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టాలీవుడ్ విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా ఆయన తనయుడు సీనియర్ స్టార్ హీరో నందమూరి అందగాడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు తేజ నేతృత్వంలో తెరకెక్కుతున్న బయో పిక్ లో జయలలిత పాత్రలో నటిస్తున్నారు అని వస్తున్నా వార్తలపై క్లారిటీ ఇచ్చారు.ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ బయో పిక్ కోసం ఇంతవరకు తనని ఎవరు సంప్రదించలేదు .జయలలిత పాత్రలో నటిస్తున్నాను అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు అని ఆమె
చెప్పుకొచ్చారు ..