తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ మేరకు ఆయన ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత ఫోటోలను ఆదివారం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సంవత్సరం దసరా నాటికి ఆలయ పనులు పూర్తవుతాయని, ఆలయ ప్రారంభం కోసం నిరీక్షిస్తున్నానని తెలిపారు .
Renovation of Yadadri Lakshmi Narasimhaswamy Temple where thousands of artisans are working overtime to give the finishing touches to this amazing structure?
Looking forward to its completion 2nd half of this year pic.twitter.com/aSkem8a747
— KTR (@KTRTRS) April 15, 2018
యాదాద్రి కొండపై 2.33 ఎకరాల్లో ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. విశాలమైన మాడవీధులు, బాహ్య, అంతఃప్రాకార మండపాలు, సప్త గోపురాల పనుల్లో వెయ్యి మంది శిల్పులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు ఏడంతస్తుల రాజగోపురంతోపాటు మూడు దిక్కుల ఐదంతస్తుల గోపురాల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.