తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ,ఇటివల తెలంగాణ జనసమితి పేరిట సరికొత్త రాజకీయ పార్టీ పెట్టిన ప్రో కోదండరాం కు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉరటనిచ్చింది.తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సరూర్ నగర్లో సమావేశాన్ని నిర్వహించాలని కోదండ రామ్ నిర్ణయం తీసుకున్నారు .
అందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు .అయితే కొన్ని అనివార్య కారణాల వలన అనుమతి ఇవ్వలేము అని పోలీసులు తేల్చేశారు.దీంతో కోదండరామ్ ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు .దీనిపై విచారించిన కోర్టు సభకు అనుమతివ్వాలని ..అనుమతిచ్చిన తర్వాత పోలీసుల సూచనలు సలహాల మేరకు సభను పెట్టుకోవాలని ఆ పార్టీ నేతలను కోర్టు ఆదేశించింది .