చెరుకు రసంలో అద్భుతమైన శక్తి దాగి ఉంది .అధిక దప్పికను తగ్గించడంతో పాటు అప్పటికప్పుడు జీవకణాలకి శక్తినిచ్చే పానీయం చెరుకు రసం అని చెప్పవచ్చు.శరీరానికి పలు రకాలుగా మేలు చేసే చెరుకు రసం త్రాగడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
వేసవికాలంలో శరీరం ఎక్కువ శాతంలో నీటిని నష్టపోతుంది.మన శరీరంలో ఉన్న వ్యవస్థలు పనిచేయడానికి నీరు చాలా అవసరం.చెరుకు రసాన్ని తీసుకోవడం వలన తక్షణ శక్తిని పొందటమే కాకుండా శరీరాన్ని డీ హైడ్రేషన్ బారి నిండి కాపాడుకోవచ్చు.
see also :కొవ్వును కరిగించే నల్లమిరియాలు..!!
వేసవిలో చెమట రూపంలో శరీరంలోని పోశాకాలని నష్టపోతూ ఉంటాం.చేరుకులో కాల్షియం,పోటాషియం ఐరన్ మరియు మెగ్నీషియంలు అధిక మొత్తంలో ఉన్నాయి.చెరుకు రసం తీసుకోవడం వలన ఈ ఖనిజాలు తిరిగి భర్తీ అవుతాయి.ఈ కాలంలో ఎండ తీవ్రత వల్ల చర్మం కమిలిపోయి చాలా డ్రైగా మారుతుంది.చెరుకు రసంలో అల్ఫా హైడ్రాక్సీ అనే యాసిడ్స్ ఉన్నాయి.ఇది మీ చర్మానికి తగినంత తేమను అందించి..చర్మం పోడిబారే సమస్యను తగ్గించి..చర్మాన్ని ఆరోగ్యంతో ఉండేలా చేస్తుంది.
see also :శృంగారానికి ముందు వీటిని త్రాగితే..స్వర్గం చూస్తారు..!!
మన శరీరంలో కాలేయ చాలా ముఖ్యమైనది .తాజా అధ్యయనాల ప్రకారం చేరుకు రసం త్రాగడం వల్ల కాలేయ పని తీరు మేరగావుతుందని తెలిసింది.అందువల్ల తాజా చెరుకు రసాన్ని తీసుకోవడం వల్ల కాలేయ పనితీరు ను మెరుగుపరుచుకోవచ్చు.చేరుకులో ఉండే పోటాషియం మీ జీర్ణ సమస్యలను నివారిస్తుంది.తాజా చెరుకు రసాన్ని తీసుకోవడం వలన కడుపులో ఏర్పడే ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.అంతేకాకుండా డీ హైడ్రేషన్ వలన మూత్ర విసర్జన చేసే సమయంలో ఏర్పడే నొప్పి మరియు మంటను తగ్గిస్తుంది.