తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో 325 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.325 పోస్టుల్లో 169 ఫైర్ మెన్, 129 డ్రైవర్/ఆపరేటర్, 20 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టులను రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా , నాలుగు టైపిస్ట్, రెండు జూనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ స్టెనో పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
