ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైసీపీ ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 9వ రోజు చేరుకున్నాయి. దీక్షలో వైసీపీ నాయకులు దీక్షలు చేస్తున్నారు.
ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న సీఎం చంద్రబాబు ఇపుడెందుకు యూటర్న్ తీసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, జిల్లా కార్యదర్శి శ్రీరంగడు డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా కోసం పోరాడిన విపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి, జైళ్లలో పెట్టించిన సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులకు ఇపుడు హోదా కోసం పోరాడే నైతిక హక్కు లేదన్నారు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడని గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు, హోదా సాధించడంలో నీ సీనియారిటీ ఏమైందని ప్రశ్నించారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని, పూటపూటకూ రంగులు మార్చే ఊసరవెల్లిలా, ఏ అవసరాని ఆ మాట మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించుకునే ఉద్యమంలో కడదాకా పోరాడదామని, ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.