క్యాస్టింగ్ కౌచ్.. గత కొన్ని రోజులుగా ఇక్కడ చూసినా అందరి నోటా ఇదే మాట. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం తో తెలుగు సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న లైంగిక వేధింపులు గత కొన్ని రోజుల నుండి ఒకొక్కటి గా వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్‌లోని చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి తమ బాధను వెల్లడిస్తున్నారు. తాజాగా శృతి అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకు జరిగిన అన్యాయాలపై ఓ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో వెల్లడించింది.
‘‘మా అసోసియేషన్‌లో కూడా లైంగికంగా వేధించేవాళ్లున్నారు. మా పెద్దలు కూడా ఉన్నారని.. అందరూ దొరలే దొరికితే మాత్రం దొంగలే’’ అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ శృతి అన్నారు.అయితే ఈ విషయం పై నటి శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందించింది.
ది గ్రేట్ మా ప్రెసిడెంట్ శివాజీ రాజాగారు మీ టోకెన్ నంబర్ వచ్చిందండి. పదిమందికి న్యాయం చేయాల్సిన పదవిలో ఉండి ఏంటండి మీ రాసలీలలు, మీరు వచ్చి దీనికి సమాధానం చెప్పాలి మా ప్రెసిడెంట్ పదవికి మీరు అనర్హులు, తప్పు ఎవరు చేసినా వదిలి పెట్టె సమస్యే లేదు అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
The Great MAA ప్రెసిడెంట్ శివాజీ రాజా గారు మీ టోకెన్ నెంబర్ వచ్చిందండి, పది మందికి న్యాయం చెయ్యాల్సిన పదవిలో వుండి ఎంటండి మీ ఈ రాసలీలలు, మీరు వచ్చి దీనికి సమాధానం చెప్పాలి MAA ప్రెసిడెంట్ పదవికి మీరు అనర్హులు, తప్పు ఎవరు చేసినా వదిలి పెట్టె సమస్యే లేదు #srireddy #srireddyleaks pic.twitter.com/p60Vp1Vefi
— Sri Reddy (@MsSriReddy) April 14, 2018