జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలపై నటి శ్రీ రెడ్డి స్పందించింది.గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన నటి శ్రీ రెడ్డి పోరాటంపై పవన్ నిన్న ఓ కార్యక్రమంలో స్పంచించి..అన్యాయం జరిగినప్పుడు చట్టపరంగా ముందుకెళ్లాలి కానీ, మీడియాకు ఎక్కడం వల్ల ఉపయోగం ఉండదని అన్నారు.
అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందిస్తూ..మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ చేసిన వ్యాఖ్యలు తనకు అసంతృప్తిని కలిగించాయని ..‘పవన్ కల్యాణ్ సార్ వ్యాఖ్యలు తకేమీ సంతోషాన్ని కలిగించలేదు. అయితే, ఇతర మహిళల రక్షణపై మాట్లాడటం, నన్ను తక్కువ చేయడం అవగాహన చేసుకోలేకపోయా. ఇది కూడా మంచి. నేనేమీ అసూయ పడలేదు. ప్రజల దృష్టి నాపై పడాలని కోరుకోవడం లేదు. అలాగే ఇతరుల మాదిరిగా నాకేమీ పాపులారిటీ అవసరం లేదు” అని శ్రీ రెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.