‘తెలుగు సినీరంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ అంశంపై ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా జూనియర్ ఆర్టిస్టులు, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు.ఈ చర్చా వేదికలో భాగంగా నటి సోనా రాథోడ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో జరుగుతున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. ‘‘నేను మొదటగా హైదరాబాద్ వచ్చినప్పుడు అమీర్‌పేట్‌లోని 24 ఫ్రేమ్ నటన నేర్పించే ఆఫీస్‌కు నాతో పాటుగా నటి పవిత్ర వెళ్లాం. నేను థర్డ్ జండర్‌గా మారుదామని మా ఇంటి నుంచి 10 వేల రూపాయలు తీసుకొచ్చాను. అక్కడ నాకు పది రోజుల యాక్టింగ్ నేర్పించారు. ఒక్కరోజు కారెక్టర్ కోసం ఒక అమ్మాయితో ఇద్దరు, ముగ్గురు కో ఆర్డినేటర్స్ గడుపుతున్నారు. ‘మరుపురాని సన్నివేశాలు’ సీరియల్ డైరెక్టర్ సంతోష్ నన్ను నీవు హిజ్రావా కాదా అంటూ.. ఒక్కసారి నన్ను బట్టలు విప్పమన్నాడు’’ అని సోనా రాథోడ్ ఈ చర్చా కార్యక్రమమలో చెప్పింది .
