ఏపీ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తారు .అందులో భాగంగా ఆయన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టీడీపీలో చేరతారు అని కొంతమంది …లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని మరికొంతమంది ..కాదు కాదు అతని సామాజిక వర్గానికి చెందిన ..టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని వార్తలను ప్రచారం చేశారు .
అయితే తానూ పార్టీ మారుతున్నాను అని వస్తున్నా వార్తలపై ఆయన స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా తను టీడీపీ ,జనసేన పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు .గత నాలుగు ఏండ్లుగా టీడీపీ కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేయడమే కాకుండా ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి పిల్ల పార్టీలా వ్యవహరిస్తూ సీజన్లలో అల్లుడు వచ్చినట్లు బాబు కోసం అప్పుడప్పుడు వచ్చి సభ పెడతాడు లేదా ప్రెస్ మీట్ పెడతాడు .ఇలాంటి చిల్లర రాజకీయాలను మానుకోవాలని ..నిలకడలేని పవన్ పార్టీలో మునగడం ..రెండు పడవుల మీద ప్రయాణం చేయడం ఒకటే అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు .అయితే వైసీపీ పార్టీలో చేరబోతున్నారా అని విలేఖర్లు ప్రశ్నించగా దానికి కాలమే సమాధానం చెబుతుందని నిర్మోహటంగా ఆయన వైసీపీలో చేరడం ఖాయం అని క్లారిటీ ఇచ్చినట్లు సమాధానం చెప్పకుండా దాటవేశారు ..