వరికోల్ గ్రామ ముద్దుబిడ్డ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గ్రామానికి శ్రీమంతుడని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొనియాడారు. మండలంలోని వరికోల్ గ్రామంలో చేపడుతున్న శ్మశాన వాటిక పనులు, డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు, నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ.. పథకాల అమలులో స్థానిక ప్రజలు అధికారులకు గాని, నాయకలకు గాని ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వద్దని అన్నారు. రాష్ట్రంలోనే తన గ్రామం ఆదర్శంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నాని తెలిపారు.గ్రామంలో నిర్మిస్తున్న 150 డబుల్ బెడ్ రూం ఇళ్లు రానున్న దసర పండుగ నాటికి లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసే విధంగా పూర్తి చేయనున్నామన్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యడిగా ఎన్నికైన జోగినపల్లి సంతోష్‌కుమార్ నిధుల నుంచి రూ.కోటితో ఆధునిక హంగులతో ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగ సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.