తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఓ అపరిచితుడి నుంచి వచ్చిన ఓ మెసేజ్ ఆశ్చర్యాన్ని గురి చేసింది. అందుకే తన సంతోషాన్ని పంచుకునేందుకు ట్విట్టర్ వేదికగా దాన్ని అందరికీ చేరవేశారు. ఇంతకీ అందులో ఏముందంటే…సర్కారీ దవాఖనల్లో ప్రసవించిన తల్లులకు అండగా, పసిబిడ్డ ఆరోగ్యానికి భరోసాగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్‌కు పెద్ద అనూహ్య స్పందన వస్తోంది. అలా ఓ సామాన్యుడు తన భార్య సుఖప్రసవం జరగడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ పార్టీని ప్రశంసించారు. తాము జీవితాంతం రుణపడి ఉంటామని కొనియాడారు.
కేసీఆర్ కిట్ ద్వారా లబ్ధిపొందిన ఓ సామాన్యుడు తనకు చేసిన మెసేజ్‌పై మంత్రి కేటీఆర్‌కు హర్షం వ్యక్తం చేశారు. ‘నమస్తే అన్నయ్య. నా భార్య పేరు బోగ లక్ష్మి. కుంకుడుపాముల గ్రామం, రామన్నపేట మండలం యాదాద్రి జిల్లా మాది. మునిపాములలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈనెల 13వ తేదీన ప్రసవించింది. తల్లి,బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. మాకు కేసీఆర్ కిట్ అందించారు. టీఆర్‌ఎస్ పార్టీకి, మీ కుటుంబ సభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటాం. థ్యాంక్యూ. థ్యాంక్యూ సో మచ్ ’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ మెసేజ్‌ను పంచుకుంటూ ‘పూర్తిగా అపరిచితుడు అయిన వ్యక్తి నుంచి ఇలాంటి మేసెజ్‌లు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అవుతున్న వారికి ఎంతో భరోసా దక్కుతోంది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కేసీఆర్ కిట్‌లను అందించారు. సర్కారీ దవాఖనాల్లో ప్రసవాల సంఖ్య 40%కు పైగా పెరిగింది’ అని పేర్కొన్నారు.
Messages like this one below ? from a complete stranger thanking the Govt for ‘KCR Kit’ which is provided for institutional deliveries in Govt hospitals ?
The no of kits distributed has crossed 2 lakhs & percentage of deliveries has gone by more than 40% in Govt hospitals ? pic.twitter.com/iPZNE3mgVz
— KTR (@KTRTRS) April 15, 2018