తెలంగాణ జేఏసీ చైర్మన్,ఇటివల తెలంగాణ జనసమితి అనే కొత్త పొలిటికల్ పార్టీ పెట్టిన ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్న రిటైర్డ్ ప్రొఫెసర్ ఏపీ ప్రజలకు సంబంధించిన అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఆయన కోరారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణంతో నష్టం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల పెట్టుబడులన్నీ ఏపీకి మాత్రమే వస్తాయని, తద్వార ఇతర రాష్ర్టాలు నష్టపోయి ఆర్థిక సమతూల్యత దెబ్బతింటుందని కోదండరాం పేర్కొన్నారు.
అంతేకాకుండా అమరావతి పేరుతో ఒకే చోట అభివృద్ధిని కేంద్రీకరించడం సరైంది కాదని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఆయన తెలిపారు. ఏపీ ప్రజలు కోరుతున్న ప్రత్యేక హోదా విషయంలో తాజాగా కోదండరాం స్పందిస్తూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడం మంచిదని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.