సినీ క్రిటిక్ కత్తి మహేశ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని శనివారం ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్యారెక్టర్ ఆర్టిస్టు సునీత ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సినీ క్రిటిక్ కత్తి మహేష్ గురించి పలు విషయాలు వెల్లడించారు.కత్తి మహేష్ మహిళలను చులకనగా చూస్తారని ఆమె ఆరోపించారు. బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయినప్పుడు షో వివరాలు తెలుసుకునేందుకు కత్తి మహేశ్‌కు ఫోన్ చేస్తే ఇంటికి రమ్మన్నారని చెప్పారు. ఆ సమయంలో 20 నిమిషాలపాటు తనను ఇబ్బంది పెట్టారని తెలిపారు.
అయితే ఈ విషయం పై కత్తి మహేష్ స్పందించారు.తనపై చేసిన లైంగిక ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టు సునీతపై రూ.50 లక్షలు పరువునష్టం దావా వేస్తానని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.నా జీవితంలో ఉన్న స్త్రీలు, నేనంటే ఏమిటో తెలిసిన మిత్రులు, వ్యక్తులకు నేను ప్రత్యేకంగా నా వ్యక్తిత్వం గురించి చెప్పనక్కరలేదు. కానీ, ఈ సందర్భంలో ఒక పబ్లిక్ స్టేట్‌మెంట్ అవసరం అనిపించి ఇది రాస్తున్నా’’ అని తెలిపారు.