వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై.. వైసీపీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఆకర్షితుడినయ్యానంటూ టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దారుణమైన కామెంట్ చేశారు. కాగా, ఏపీ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత విశ్లేషణాత్మక శోధన చేసేందుకు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ తన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఏపీ సర్కార్‌పై చేసిన విమర్శలకు జలీల్ ఖాన్ స్పందించారు.
అయితే, జగన్ మాటలకు జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ జలీల్ ఖాన్ జగన్‌ను ఉద్దేశించి ఏం మాట్లాడాడో.. అతని మాటల్లోనే..!!
నువ్వు లండన్, అమెరికాలో చదువుకుని పెద్ద పెద్ద కాన్వెంట్లలో చదువకుని.. స్పెషలిస్ట్ స్టేటస్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదని చెప్పిన చరిత్ర నీది.నీకు ఆ మాత్రం.. ఇనకమ్ ట్యాక్స్ ఉండదో.. లేదో అన్నవాడు. నువ్వు ముఖ్యమంత్రికి అర్హుడా.. అనర్హుడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. స్పెషలిస్ట్ స్టేటస్, ఏదైతే చట్టన,, విభజన లో ఇచ్చిన హామీలు దాని గురించి చేయాల్సింది ఎవరు..? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ.
నరేంద్ర మోడీ పేరెత్తకుండా, గత నాలుగు సంవత్సరాల నుంచి డ్రామా చేస్తూ ఒక్క పదం నీవు మోడీ పేరు తీసుకోవడానికి బాధపడుతున్నావ్..!!
see also : నాడు ఎన్టీఆర్ పోరాటం చూశా.. నేడు జగన్ పోరాటం చూస్తున్నా..! హ్యాట్యాఫ్..!!
స్పెషలిస్ట్ స్టేటస్ ఇచ్చేది చంద్రబాబు కాదు. చంద్రబాబు బాధ్యతగల ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజానీకానికి నష్టం జరగకుండా నాలుగు సంవత్సరాలు ఓపికపట్టి, సహనంతో పదే పదే ఢిల్లీ నాయకుల దగ్గరకు వెళ్లి రాష్ట్రాన్ని కాపాడమని అడిగితే.. చంద్రబాబుని యూటర్న్ అంటున్నావ్..!! నువ్వు ఏ టర్న్ తీసుకున్నావ్ జగన్.. లెఫ్ట్ టర్న్ తీసుకుంది నువ్వు.. రైట్ టర్న్ తీసుకుంది నీవు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది నీవు. ఈ రోజు రాష్ట్రానికి వచ్చే నిధులను కూడా అడ్డగొట్టి. ప్రతీ రోజు ఒక ఉత్తరం ఇచ్చి చెడగొట్టింది నీవు. రాష్ట్ర విభజన టైంలో కూడా నీ రెండు నాల్కుల ధోరణి వల్లే ఏపీ ఈ స్థాయికి వచ్చింది. ఇంకా ఈ రాష్ట్రాన్ని రాబంధుల్లా.. దోచుకోవడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారు. నీ పాదయాత్రకు వస్తున్న జనం నిన్ను చూసేందుకు వస్తున్నారేకానీ.. నీకు ఓట్లు మాత్రం వేయరు.
ఇలా.. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆద్యాంతం జగన్ పాదయాత్రపై తీవ్రమైన కామెంట్లు చేశారు. అయితే, స్పెషల్ స్టేటస్‌ను.. స్పెషలిస్ట్ స్టేటస్ అని పలకడంపై, రాష్ట్ర విభజన సమయంలో జగన్ రెండు నాల్కుల ధోరణి అవలంభించారని, ప్రత్యేక హోదా సాధన విషయంలో యూటర్న్ తీసుకున్న చంద్రబాబును విమర్శించకుండా.. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటికీ ప్రత్యేక హోదా సాధన విషయంలో ఒకే స్టాండ్‌పై ఉన్న జగన్‌ను విమర్శించడం, అధికార హోదాలో ఉండి ఏపీకి పెట్టుబడులు తీసుకురాలేని చంద్రబాబును విమర్శించకుండా.. పెట్టుబడులకు పెట్టేందుకు వచ్చిన కంపెనీలను జగన్ అడ్డుకుంటున్నారని విమర్శించడాన్ని చూస్తుంటే..జలీల్ ఖాన్ నిజంగానే బీ.కామ్‌లో ఫిజిక్స్ చదివారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.