ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొసనసుగుతూనే ఉంది .అందులో భాగంగా నిన్న శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన సమయంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తన అనుచవర్గంతో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .తాజాగా వైఎస్సార్ కడప జిల్లాకు మాజీ మంత్రి ,టీడీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి వైసీపీ గూటికి చేరారు .అందులో భాగంగా ఆయనతో పాటుగా నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు నాయకులు,కార్యకర్తలు హర్షవర్ధన్ రెడ్డితో కల్సి ఎర్రగుంట్ల సమన్వయ కర్త సుధీర్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు ..
Tags andhrapradesh chandhrababu erraguntla jagan kamalapuram mv harshavardhan reddy mv maisoorareddy tdp ysrcp