Home / ANDHRAPRADESH / త్వ‌ర‌లో ఆ ఇద్ద‌రు మంత్రుల అరెస్ట్‌..! వాస్త‌వ క‌థ‌నం మీకోసం..!!

త్వ‌ర‌లో ఆ ఇద్ద‌రు మంత్రుల అరెస్ట్‌..! వాస్త‌వ క‌థ‌నం మీకోసం..!!

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌ళ్లింది. అంతేకాకుండా అనుభ‌వ‌జ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా స‌రే ప్ర‌త్యేక హోదా సాదిస్తా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్ర‌పంచాన్ని త‌ల‌ద‌న్నేలా రాజ‌ధానిని క‌డ‌తా, 2019 ఎన్నిక‌ల్లోపూ ప్ర‌తీ ఇంటికి కుళాయి ద్వారా నీరు స‌ర‌ఫ‌రా అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న‌, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ చేస్తా, నిరుద్యోగ భృతి, ఇలా చాలా హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి 2014 చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

see also : నాడు ఎన్టీఆర్ పోరాటం చూశా.. నేడు జ‌గ‌న్ పోరాటం చూస్తున్నా..! హ్యాట్యాఫ్‌..!!

అయితే, 2014లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ప్ప‌టినుంచి ఇప్ప‌టీకి ఏ ముఖ్య‌మంత్రిపై రాన‌న్ని అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన పోల‌వ‌రంలో కూడా చంద్ర‌బాబు త‌న మంత్రుల‌తో క‌లిసి కేంద్రం నుంచి వ‌చ్చిన న‌గ‌దును దారి మ‌ళ్లించారన్న ఆరోప‌ణ‌ల‌కు పోల‌వ‌రం త‌హ‌శీల్దారు బ‌దిలీ ఉదంతం మ‌రింత ఆజ్యం పోసింది. ఆ కుంభ‌కోణాన్ని ఆధారాల‌తో సహా నిరూపిస్తామంటూ ఇటు ప్ర‌జాస్వామిక వాదుల‌తోపాటు బీజేపీ నేత‌లు, వైసీపీ నేత‌లు ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. పోల‌వ‌రంపై సీబీఐ ఎన్‌క్వైరీ వేయ‌డం ఆల‌స్యం.. ఆ వెంట‌నే చంద్ర‌బాబు జైలుకెళ్ల‌డం ఖాయ‌మంటూ ప‌లు క‌థ‌నాలు ప్ర‌స్త‌తం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కూడా అవుతున్నాయి. అయితే, పోల‌వ‌రం ప్రాజెక్టు భారీ కుంభ‌కోణాన్ని ప‌క్క‌న‌పెట్టి, ప‌ట్టిసీమ ప్రాజెక్టు పేరుతో టీడీపీ స‌ర్కార్ దోచుకున్న సొమ్మును ఆధారాల‌తో స‌హా అంటూ ఓ క‌థ‌నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఓ సారి ఆ క‌థ‌నం సారాంశం ప‌రిశీలిస్తే..!!

see also : జ‌గ‌న్ కోసం ఏక‌మైన ఏపీ ఆర్టీసీ యూనియ‌న్లు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతుల సంక్షేమం కోసం ప‌ట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి, పంట పొలాల‌ను ప‌చ్చ‌గా మారుస్తామంటూ సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి, భూ సేక‌ర‌ణ చేసి ప్ర‌భుత్వం వేల‌కోట్ల‌కు అవినీతికి పాల్ప‌డింది. రూ.1,125 కోట్ల వ్య‌య ప్ర‌తిపాద‌న‌ల‌తో మొద‌లైన ప‌ట్టిసీమ ప్రాజెక్టు చివ‌ర‌కు 1,667 కోట్ల‌కు చేరింది. ప‌ట్టిసీమ ప్రాజెక్టుకు వేసింది 24 పైప్‌లు అయితే, వాటిని 30 పైపులుగా చూపి రూ.342 కోట్లును చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స్వాహా చేసింది. అలాగే, ప‌ట్టిసీమ ప్రాజెక్టులో నిర్మించిన డ‌యాఫ్ర‌మ్ వాల్ పేరుతో టెండ‌ర్లు పిల‌వ‌కుండానే రూ.90 కోట్లు సీఎం చంద్ర‌బాబు కాజేశార‌ని చెప్పిన‌ కాగ్ నివేదిక‌ను ఆధారంగా పేర్కొంది సోష‌ల్ మీడియా క‌థ‌నం. అంతేకాకుండా, మ‌ట్టిని తీయ‌డానికి రూ.67 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు ప‌ట్టిసీమ ప్రాజెక్టు లెక్క‌ల్లో చేర్చార‌ని, అదంతా చంద్ర‌బాబు అవినీతి భాగోతం. ప‌ట్టిసీమ ప్రాజెక్టులో త‌వ్విన మ‌ట్టిని.. ఒక లారీ మ‌ట్టి రూ.4 ల‌క్ష‌లు వంతున చంద్ర‌బాబు అమ్ముకొన్నార‌ని ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ప్రాజెక్టుల పేరుతో భారీ కుంభ‌కోణానికి పాల్ప‌డ్డ చంద్ర‌బాబును ఏ1, జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఏ2 నిందితులుగా సోష‌ల్ మీడియా క‌థ‌నం ప్ర‌చురించింది.

 

మంత్రి దేవినేని ఉమా అరెస్టుకు రంగం సిద్ధం..!!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి, ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రివ‌ర్గంతో క‌లిసి భారీ అవినీతికి పాల్ప‌డ్డార‌న్న ఆధారాలు కేంద్రం వ‌ద్ద ఉన్నాయి. ప‌క్కా ఆధారాలు ల‌భించ‌డంతో చంద్ర‌బాబుపై సీబీఐ ఎన్‌క్వైరీ వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. సీబీఐ ఎంత త్వ‌ర‌గా విచార‌ణ ప్రారంభిస్తే అంతే త్వ‌ర‌గా దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు అరెస్టు అవుతార‌ని, అంతేకాకుండా, ఈ కేసుకు మ‌రో న‌లుగురు ఐఏఎస్ స్థాయి అధికారులతోపాటు, మ‌రో ఇద్ద‌రు టీడీపీ నేత‌లు అరెస్టు కావ‌డం క‌న్ఫాం అని చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.
ఏదేమైనా చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతికి పాల్ప‌డిందంటూ రోజుకో వార్త ప‌త్రిక‌ల్లో వెలువ‌డుతుండ‌టంతో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌లో ఉన్నారు.

ఒక్కో నారాయ‌ణ క‌ళాశాల‌లో పంపిణీకి సిద్ధంగా రూ.25 కోట్లు..!!

టార్గెట్ – 2019 ఎలెక్ష‌న్స్‌, ఒక్కో నారాయ‌ణ క‌ళాశాల‌లో పంపిణీకి సిద్ధంగా రూ.25 కోట్లు..!! అవును, 2014 ఎన్నిక‌ల్లో మోస‌పూరిత హామీలు ఇచ్చి ఏపీలో ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కించుకున్న చంద్ర‌బాబు నాయుడు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లోనూ అదే రీతిన గెలిచేందుకు పెద్ద కుట్రే ప‌న్నుతున్నారు. అందులో భాగంగానే ఏపీ టీడీపీ ఆర్థిక మూల‌స్తంభ‌మైన మంత్రి నారాయ‌ణ‌కు చెందిన నారాయ‌ణ క‌ళాశాల‌ల్లో కోట్లకు కోట్లు న‌గ‌దు స‌ర‌ఫ‌రా అయింది. ఇలా ఏపీలోని అన్ని నారాయ‌ణ క‌ళాశాల‌ల‌కు స‌ర‌ఫ‌రా అయిన న‌గ‌దు ఎంతో తెలుసా..? ఒక్కో క‌ళాశాల‌లో ఉన్న న‌గ‌దు విలువ రూ.25 కోట్లు అంటూ ఓ క‌థ‌నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అంతేకాకుండా, ఆ క‌థ‌నం సారాంశాన్ని ప‌రిశీలిస్తే మంత్రి నారాయ‌ణ‌పై సీబీఐ ఎన్‌క్వైరీ జ‌రిగే అవ‌కాశం కూడా ఉంద‌ని పేర్కొంది.

అయితే, గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బు, మ‌ద్యం పంచుతూ రాష్ట్రంలోని చాలాచోట్ల ప‌ట్టుబ‌డ్డ విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎలాగో అధికారంలో ఉన్నాం క‌దా..! ఈ సారి అలా చేయ‌డం మ‌రింత సుల‌భ‌త‌ర‌మ‌ని భావించిన టీడీపీ ఈ ప‌నికి ఒడిగ‌ట్టిందని సోష‌ల్ మీడియా క‌థ‌నం పేర్కొంది. ఆ క‌థ‌నం ప్ర‌కారం ఇంకాస్త లోతుగా వెళ్తే.. నారాయ‌ణ క‌ళాశాల‌ల్లో రూ.25 కోట్లు చొప్పున న‌గ‌దు ఉంద‌ని సీబీఐ కూడా న‌మ్ముతుండ‌ట‌. ఈ నేప‌థ్యంలో సీబీఐ గ‌నుక ఏపీ ప్ర‌భుత్వంపై విచార‌ణ చేప‌డితే, మోడీ ప్ర‌భుత్వం మాపై క‌క్ష‌పూరితంగానే వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, ఇది తెలుగువారి ఆత్మ‌గౌర‌వానికి సంబంధించిన విష‌యంగా పేర్కొంటూ త‌న అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మయ్యారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. మ‌రీ ఈ క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వంపై సీబీఐ దాడులు చేస్తుందో లేక‌.. ప్ర‌తీసారి లాగానే మోడీ వ‌ద్ద టీడీపీ మోక‌రిల్లుతారో వేచి చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat