ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో బంద్‌లు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నుంచీ హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు హోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. హోదా కావాలని రాష్ట్రం ఉద్యమిస్తుంటే ఆయనకు సింగపూర్ ప్రయాణాలు ఎందుకని ప్రశ్నించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అమరావతిలో ఆనంద నగరం కార్యక్రమం చేపట్టారన్నారు. రాష్ర్టానికి వైసీపీ చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా శుక్రవారం ఆ పార్టీ మహిళా విభాగం నగరాధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీర, గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ట వర్‌క్లాక్ నుంచి ప్రధాన తపాలా కార్యాల యం వరకూ ర్యాలీ నిర్వహించి, వాటిని పో స్టుబాక్సులో వేశారు. హోదా కోసం ఈనెల 16న హోదా సాధన సమితి అధ్వర్యంలో చేపట్టే రాష్ట్ర బంద్‌ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు