2014 ఎన్నికల్లో ఒకే ఒక్కడిని..కేంద్ర, రాష్ట్ర నాయకులు, సినీ హిరోలు ముకుమ్మడిగా అందురు ఎకమే ఓడించిన ..ప్రజల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న దేశంలోనే ఎకైక వ్యక్తి ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ అంటున్నారు వైసీపీ నేతలు. గత 4 సంవత్సరాలు నుండి టీడీపీ చేస్తున్న అవీనితిని ,భూకభ్జలను ,నేరాలను ఇలా ప్రతి అన్యాయాన్ని ప్రజలకు తెలిసే విదంగా ..అర్థమయ్యో విధంగా 2017 నవంబర్ నుండి ఇప్పటి వరకు అలుపనేది లేకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని ఆటంకలు కలింగించినా..నిర్విరామం లేకుండా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజవంతంగా కొనసాగుతుంది. జగన్ తో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. మరోపక్క పాదయాత్ర మొదలు నుండి ఇప్పటి వరకు అక్కడ అక్కడ టీడీపీ నేతలు వైసీపీ చేరుతున్నారు. ఇందులో బాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి శనివారం వైసీపీ పార్టీలో చేరారు. కనకదుర్గమ్మ వారధి వద్ద వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరికపై యలమంచిలి రవి విలేకరులతో మాట్లాడుతూ టీడీపీలో తనకు గౌరవం ఇవ్వలేదని అన్నారు. పదవుల కోసం తాను పార్టీ మారలేదని, తనకు అప్పగించిన బాధ్యతలకు అనుగుణంగా ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
చంద్రబాబు తనను రెండుసార్లు మోసం చేశారని, రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీపై నమ్మకం పోయిందన్నారు. కార్యకర్తలు, స్నేహితులతో చర్చించిన అనంతరం టీడీపీని వీడి వైసీపీతో చేరినట్లు యలమంచిలి రవి తెలిపారు. ఇందులో బాగంగా ఓ టీవీ చానుళ్లు రిపోర్టర్ మీతో పాటు…మీ తరువాత జిల్లాలో ఇంకెవరైన వైసీపీలో చేరుతున్నారని అడగ్గా..వేంటనే రవి చూస్తారు గా ఇక నుండి మీరు ఎంతమంది పెద్ద పెద్ద టీడీపీ నేతలతో సహ,వేల మంది కార్యకర్తలు చేరుతారో అని అన్నారు. ఇంకా ఇప్పుడే స్టాట్ అయ్యింది..ఇక ముందు ఊహించని విధంగా వైసీపీలోకి వలసలు జరుగుతాయని గట్టి నమ్మకంతో చెప్పారు. నా తండ్రి లాగానే వివాదాలు లేకుండానే వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తాను. మా తాత దగ్గర నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాం. వైఎస్ జగన్ మాటకు కట్టుబడి ఉన్నాను’అని యలమంచిలి రవి పేర్కొన్నారు. ఈ మాటలతో ఇంకా జిల్లాలో టీడీపీ నేతలు వైసీపీలో చేరుతారని స్పష్టంగా తెలుస్తుంది.