ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పంచ్‌ల వర్షం కురిపించారు. కాగా, శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ తల కిందపెట్టి.. కాళ్లుపైకి పెట్టినా 2019లో సీఎం కాలేరని విమర్శించారు. నిజాయితీకి నిలువుటద్దం అయిన సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ లేనిపోని ఆరోపణలు చేయడం తనను బాధించాయని, వైఎస్ జగన్‌కు తన తండ్రి, తాతలాగే క్రిమినల్ ఆలోచనలే వస్తున్నాయని ఎద్దేవ చేశారు. టీడీపీలో ఎవరైనా అవినీతికి పాల్పడితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే చర్యలు తీసుకుని, అటువంటి వారిని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తారని, కానీ జగన్ మాత్రం తన వైసీపీ పార్టీలో నేరస్థులను చేర్చుకుంటూ.. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
see also : నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ : ప్రొ.హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు..!!
నీతోపాటు జైల్లో ఉన్న విజయసాయిరెడ్డిని రాజ్యసభ సభ్యుడిని చేశావు, సారా, వైన్ మాఫియాను ప్రోత్సహించి, అడ్డగోలుగా ధనం ఆర్జించిన బొత్స సత్యనారాయణను పక్కనే కూర్చోబెట్టుకున్నావు. ఇదీ నీ అవినీతికి నిదర్శనం కాదా..? అని జగన్‌ను ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడు. కేవలం ఒక్క జగన్ మోహన్‌రెడ్డి వల్లే 12 మంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారన్నారు. జగన్ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న విజయసాయిరెడ్డి అయితే రెచ్చిపోయి, పరిధిదాటి మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు మంత్రి అచ్చెన్నాయుడు.