ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.ఒకవైపు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.గత నాలుగున్నర నెలలుగా క్షేత్రస్థాయి నుండి ప్రజలు గత నాలుగు ఏండ్లుగా ఎదుర్కుంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వైసీపీ ఏమి చేస్తుందో ఇటివల ప్లీనరీ సందర్భంగా హమీచ్చిన నవరత్నాల గురించి వివరిస్తూ ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
మరోవైపు ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు తమ్ముళ్ళు గత నాలుగు ఏళ్ళుగా కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మిత్రపక్షమైన బీజేపీ పార్టీతో కల్సి ఉండి ..ఇటివల వైసీపీ దెబ్బకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేసిందని ఎన్డీఏ నుండి బయటకు వచ్చి ప్రత్యేక హోదా కావాలని సైకిల్ యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్ళుతున్నారు.ఈ తరుణంలో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన సీనియర్స్ జర్నలిస్టుల బృందం ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ప్రజలు పట్టం కట్టనున్నారు అని అంశం మీద సర్వే నిర్వహించారు.
ఈ సర్వే రాష్ట్రంలో ఉన్న మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట యాబై ఐదు నియోజకవర్గాలను ఆధారంగా తీసుకొని ఈ జర్నలిస్టు బృందం సర్వే నిర్వహించింది.ఈ సర్వే మొత్తం గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ కురిపించిన ఆరు వందల ఎన్నికల హామీలు ,రాష్ట్ర విభజన సమయంలో హామీల అమలుపై ప్రోగ్ర్రేసివ్ రిపోర్టు మాదిరిగా ఈ బృందం నిర్వహించింది.అయితే సర్వేలో అత్యధికంగా ప్రజలు గతంలో తోమ్మిదేండ్ల పాలన అనుభవం ,రాజకీయంగా అనుభవం ఉండటమే కాకుండా ఆరు వందల ఎన్నికల హామీలను నమ్మి చంద్రబాబుకు అవకాశమిచ్చాం .అంతే కాకుండా విభజన వలన నష్టపోయిన తమకు ఇటు రాష్ట్రంలో టీడీపీ అటు కేంద్రంలో బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తే ఇచ్చిన ప్రతి హమీను నెరవేర్చే బాధ్యత తనది అని ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వడంతో ఉభయ గోదావరి జిల్లాలోని కాపులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గం టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఓట్లు వేశామని వారు తెలిపారు.
గత నాలుగు ఏండ్లుగా ఇచ్చిన ఒక్క హమీను కూడా నెరవేర్చకుండా రాష్ట్రానికి న్యాయంగా రావలసిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను తుంగలో తొక్కడంతో ఈ సారి బాబును నమ్మి ఓట్లేసే పరిస్థితి లేదని వారు తేల్చి చెప్పారు.రాజధాని కుంభ కోణాల దగ్గర నుండి వైజాగ్ భూముల కుంభ కోణాల వరకు ,కాల్ మనీ నుండి ఓటుకు నోటు కేసు వరకు ,బ్యాంకులకు తమ పార్టీకి చెందిన ఎంపీలు ,కేంద్రమంత్రులు సైతం టోపీ పెట్టడం వరకు ఇలా దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడటమే కాకుండా ప్రత్యేక హోదా కోసం రోడ్లు ఎక్కితే జైలే అని బెదిరించిన చంద్రబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఎంపీల రాజీనామా ,కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాకుండా దేశ రాజకీయాలను షేక్ చేస్తూ ఎంపీలు అమరనిరాహార దీక్ష చేయడం ఇలా ప్రజల్లో చంద్రబాబు కంటే జగన్ ను నమ్మితేనే తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు చెప్పారు.గ్రౌండ్ లెవల్లో ఈ జర్నలిస్టు బృందం చేసిన సర్వేలో ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలపై తీవ్ర వ్యతిరేకత ఉండటం ..బాబు పబ్లిసిటీ తప్పా పనులు చేయడం చాలా తక్కువ ఉండటంతో ప్రజలు ఈ సారి జగన్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అని ఈ సీనియర్ జర్నలిస్టు బృందం చేసిన సర్వేలో తేలింది.