బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉత్సాహ పరిచారు. శుక్రవారం జరిగిన చిన్నస్వామి స్డేడియంలో బెంగళూరు-పంజాబ్ మ్యాచ్‌కు అనుష్క హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క ఎంతో ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్ ఆసాంతం ఆమె తన భర్త, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఒక దశలో మైదానంలో ఉన్న కోహ్లి కోసం ఫ్లయింగ్ కిస్సెస్ పంపించారు. దీంతో గ్రౌండ్లో వాతావరణం ఒకింత ప్రేమభరితంగా మారిపోయింది. మ్యాచ్‌లోని ఓ దశలో కోహ్లి క్యాచ్ అందుకోవడంతో ఆనంద డొలికల్లో తేలిపోయిన అనుష్క గాలిలో తన భర్తకు ముద్దులు పంపించారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌ను ఓడించి.. హోమ్‌గ్రౌండ్‌లో విజయంతో ఐపీఎల్లో బెంగళూరు జట్టు బోణీ కొట్టింది. సొంత మైదానంలో బెంగళూరు మ్యాచ్‌లు జరిగినప్పుడు అనుష్క హాజరవ్వడం పరిపాటే. గతంలోనూ బెంగళూరు మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలోని స్టాండ్స్‌లో ఆమె దర్శనమిచ్చారు. బెంగళూరు జట్టును, ముఖ్యంగా కోహ్లిని ఉత్సాహపరిచేందుకు ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరవుతున్న అనుష్క పంజాబ్ తో మ్యాచ్ సందర్భంగా ప్రీతి జింతాతో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు.
