గత ఎడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు అలుపనేది లేకుండా ..అదే బలంతో, అదే ఊపూలో అశేశ ప్రభజనం మద్య.. అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఆటంకలు కలింగించినా..నిర్విరామం లేకుండా ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం విజయవాడ కనక దుర్గమ్మ సాక్షిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. 136వ రోజు కనకదుర్గ వారధి వద్ద వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టారు.
ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. వైఎస్ జగన్ తో కలసి అడుగు వేసేందుకు జనం భారీగా తరలిరావడంతో కనకదుర్గ వారధి పోటెత్తింది. వైఎస్ జగన్ను కలిసేందుకు కృష్ణా జిల్లా ప్రజలు తరలివచ్చారు. అయితే జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలో ఈరోజు వైఎస్ జగన్ తో పాటు నడిచే ప్రజానికాన్ని టీడీపీ నేతలు చూస్తే 2019 ఖచ్చితంగా కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఖాయం అని పలువురు సీనియర్ రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు.