తెలుగు ఇండస్ట్రీలో కామాంధుల గురించి ధైర్యంగా బయటకు చెబుతున్నారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో శ్రీరెడ్డితో పాటు పాల్గొన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు శృతి, శ్రీవాణి మాట్లడుతూ.. పచ్చి కామాంధుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత పడుకుంటనే అవకాశాలు ఇస్తానని డైరెక్టుగా మాట్లాడతాడని పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఓటీవీ చర్చా కార్యక్రమంలో ఆరోపణలు చేశారు. అంతేగాక అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇంతకి అంతమంది మహిళలు చెప్పిన ఎవరు ఆ పచ్చి కామాంధుడు అంటే నిర్మాత వాకాడ అప్పారావు అంట . మెగస్టార్ చిరంజీవి నటిచింన ఖైదీ నెం 150 సినిమా సమయంలో అవకాశం కోసం ఆఫీసుకు ఫోటో తీసుకుని వెళ్లాము. ఫోటో వెనకాల ఫోన్ నెంబర్ రాసి అక్కడ ఇచ్చాము. అయితే అక్కడ ఆఫీసులో ఒక వ్యక్తి అందరూ ఫోటోస్ ఇస్తున్నారు, మాకు చూసే టైమ్ కూడా ఉండటం లేదు అని చెప్పి…. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావుతో మాట్లాడాలని చెప్పి అతడి నెంబర్ ఇచ్చాడు. ఆయనకు ఫోన్ చేసి చిరంజీవి సినిమాలో అవకాశం ఇప్పించండి సార్ అని అడిగితే…. నీ వయసు ఎక్కువగా ఉంది, ఎవరైనా వయసులో ఉన్న అమ్మాయిని సెట్ చేస్తే మీ వయసుకు తగ్గ క్యారెక్టర్ ఇప్పిస్తాను అన్నాడు… అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీవాణి ఆరోపించారు. ఇదంతా కామన్ అని ఒప్పించే ప్రయత్నం ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు, మేమే నటించడానికి వచ్చాము, చిరంజీవి గారి సినిమాలో ఒక్క క్యారెక్టర్ అయినా చేయాలని ఆశతో వచ్చాము.. మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పాం. అపుడు దానికి అతడు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఇదంతా కామన్…. ఇది లేనిదే క్యారెక్టర్ ఉండదు. మీరు కొత్తవారు కాబట్టి మీకు తెలియక పోవచ్చు అని భహిరంగా మాట్లడినాడు అని వారు తెలిపారు.
`
అయితే, చాలా మంది నెటిజన్లు ఇప్పుడు వాకాడ అప్పారావు గురించి నెట్టింట్లో శోధించడం మొదలు పెట్టారు. అసలు ఎవరీ వాకాడ అప్పారావు, ఎవరెవరి దగ్గర పనిచేశాడు, ఏఏ సినిమాలకు ప్రొడ్యూసర్గా, అలాగే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు అన్న విషయాలను పరిశీలిస్తే.. వాకాడ అప్పారావు బాలకృష్ణ నటించిన మహారధి సినిమాకు ప్రొడ్యూసర్గాను, అలాగే, పవన్ కల్యాణ్ నటించిన అన్నవరం, సునీల్ నటించిన అందాల రాముడు, జగపతిబాబు నటించిన శివరామరాజు సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు వాకాడ అప్పారావు.
వాకాడ అప్పారావు – చిరంజీవి సంబంధం ఇలా..!!
2017 సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 చిత్రానికి వాకాడ అప్పారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారని,. ఆ సమయంలోనే వాకాడ అప్పారావుకు, చిరంజీవికి మధ్య పరిచయం మరింత పెరిగిందన్నది సినీ జనాల మాట. అయితే, తాజాగా వాకాడ అప్పారావు వేశాల కోసం వచ్చే మహిళలను లైంగికంగా వేధించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే, చిరంజీవి చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్న సమయంలోనే వాకాడ అప్పారావు అనేక మంది మహిళా నటుల మానాలతో ఆడుకున్నారని, ఈ విషయం చిరంజీవికి తెలియకుండానే జరిగిందా..? అంటూ ఇటీవల ఓ మీడియా ఛానెల్లో పాల్గొన్న కొందరు వాకాడ అప్పారావు బాధితులు బహిరంగంగా ప్రశ్నించిన విధానం ఇప్పుడు సినీ ఇండస్ర్టీలో పెను చర్చకు దారి తీసింది.