Home / ANDHRAPRADESH / టీడీపీ సీనియ‌ర్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

టీడీపీ సీనియ‌ర్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

వైఎస్ జ‌గ‌న్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌. త‌న నోటి నుంచి ఏదైన మాట బ‌య‌ట‌కు వ‌స్తే.. ప్రాణం మీద‌కు వ‌చ్చినా స‌రే ఆ మాట‌మీద‌నే నిల‌బ‌డే నైజం అత‌ని సొంతం. ఇదే రీతిన నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని చూశాం.. ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్‌ను చూస్తున్నాం. అలా మాట‌మీద నిల‌బ‌డే గుణ‌మే వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని ప్ర‌జ‌ల గుండెల్లో ఉండేలా చేస్తే.. వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పెరిగేలా చేసింది. ఒక వ్య‌క్తి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై నిరంత‌రాయంగా136 రోజులు పాద‌యాత్ర చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఇవాళ వైసీపీలో చేరిన టీడీపీ సీనియ‌ర్ నేత య‌ల‌మంచిలి ర‌వి.

see also :

నాడు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్‌.. నేడు వైఎస్ జ‌గ‌న్ : ప్రొ.హ‌ర‌గోపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

అయితే, ఇవాళ య‌ల‌మంచిలి ర‌వి మీడియాతో మ‌ట్లాడుతూ.. ఇప్ప‌టికే ఎనిమిది జిల్లాల్లో పూర్తిచేసుకున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భించింద‌న్నారు. ఏపీలోని ప్ర‌తీ సామాన్యుడు వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని కోరుకుంటున్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కాగా, య‌ల‌మంచిలి ర‌వి సీఎం చంద్ర‌బాబు గురించి మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా ఏపీని మార్చిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌న్నారు. నాడు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి సాక్షిగా ప్ర‌త్యేక హోదా సాధిస్తాన‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు.. నేడు కేంద్ర ప్ర‌భుత్వంతో కుమ్మ‌క్కై ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌న్నారు. ప్ర‌త్యేక ప్యాకేజీ అంటూ ఏపీ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టిన చంద్ర‌బాబు మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌ను మోస‌గించేందుకు ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం అంటూ నాట‌కాలు ఆడుతున్నార‌న్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి విడిచి.. రాజ‌ధానికి డ‌బ్బులు ఇవ్వాలంటూ ప్ర‌జ‌ల ర‌క్త‌మాంసాల‌ను పీలుస్తున్నార‌ని విమ‌ర్శించారు య‌ల‌మంచిలి ర‌వి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat