టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశంలో ఆడవారిపై జరుగుతున్నా దారుణాల గురించి స్పందిస్తూ విస్మయాన్ని వ్యక్తం చేశారు.జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉదంతం గురించి ఆయన మాట్లాడుతూ కథువా లో ఎనిమిదేళ్ళ పాపపై మృగాల సామూహిక అత్యాచారం ,హత్య చేయడంపై పవన్ కళ్యాణ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు .
దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఆడవారికి జోలికి వస్తే తాటా తీయాలని ఆయన పిలుపునిచ్చారు .ఆడవారిని వేధించే మృగాలను ,ఆకతాయిలను ,అత్యాచారం చేసేవాళ్ళను బహిరంగంగా ఉరి తీయాలని ఆయన అన్నారు ..