తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రవీంద్రభారతిలో ఇవాళ టీప్రైడ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,జగదీష్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ ఎస్సీ వ్యాపారవేత్తలకు అవార్డులు ప్రధానం చేశారు.
Minister @KTRTRS addressing the 'Dr BR Ambedkar T-Pride Awards 18' ceremony held at Ravindra Bharati. #AmbedkarJayanti pic.twitter.com/9EcW4GdFYM
— Min IT, Telangana (@MinIT_Telangana) April 14, 2018
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు దక్కినట్లుగా ప్రోత్సాహం దేశంలో మరెక్కడా దక్కటం లేదన్నారు.దళితుల కోసం బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఎన్‌పీఏ బారిన పడకుండా పరిష్కారం చూపిస్తామన్నారు. రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్‌తో మూతపడే స్థితిలో ఉన్న కంపెనీలను ఆదుకుంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Ministers @KTRTRS and Jagadish Reddy formally lighting the lamp at the Birth Anniversary celebrations of Babasaheb Dr BR Ambedkar at Ravindra Bharati pic.twitter.com/2PaLp2D6c3
— Min IT, Telangana (@MinIT_Telangana) April 14, 2018
అంబేడ్కర్ ఓవర్సీస్ పథకంతో విదేశీ విద్యకు ఆర్థిక సాయం అందిస్తున్నామని.. నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్రంలో 700 పైచిలుకు గురుకులాలను ప్రారంభించుకున్నామని తెలిపారు.మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
As part of Telangana Industry & Commerce dept’s T-Pride (Telangana Program for Rapid Incubation of Dalit Entrepreneurs) gave away awards to promising entrepreneurs
Also distributed pending industrial incentives worth Rs. 200Cr pic.twitter.com/mRiTK7ozAu
— KTR (@KTRTRS) April 14, 2018