వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది . జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది . జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.
see also :“భరత్ అనే నేను ” సినిమాని ఎలాగైనా సక్సెస్ చేసేందుకు నమ్రత ఏం చేస్తుందంటే..!!
ఈ క్రమంలో విజయవాడలో వైసీపీ ,టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఫ్లెక్సీ విషయంలో గొడవ తలెత్తింది. ఈరోజు వైసీపీలో టీడీపీ నేత యలమంచిలి రవి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతుండటంతో విజయవాడ నగరంలో పెద్దయెత్తున వైసీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగన్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చించి వేశారు. దీంతో పోలీసులకు టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.